♥️ కథ-12 ♥️
అనుభూతి - జీవితంలో విస్తృత దృక్పథం కలిగిఉన్నందుకు నేను కృతజ్ఞుడను
స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష)
ఒకసారి, చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగావకాశం వచ్చింది, దాని కోసం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు . చాలా మంది అభ్యర్థులు తమ పని అనుభవం, విద్యా ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరయ్యారు.
అయితే ఇక్కడ అధికారులు కాస్త భిన్నమైన రీతిలో ప్రశ్నలు అడుగుతున్నారు.
బెల్ మోగించడం, ప్యూన్ మొదటి అభ్యర్థిని పిలవడంతో ఇంటర్వ్యూ ప్రారంభమైంది.
ఒక యువకుడు తన ఫైలు తీసుకుని ఛాంబర్‌కి వెళ్లాడు. తలుపు తెరిచి లోపలికి రావడానికి అనుమతి అడిగాడు.
"రావచ్చు," అని ఇంటర్వ్యూ అధికారి బదులిచ్చాడు.
యువకుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ అతని ముందు ఉన్న కుర్చీలో కూర్చోవడానికి లోపలికి వెళ్ళాడు.
అతను తన ఫైల్ వైపు చూసి, "చాలా బాగుంది. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి.
మీరు టూ-సీటర్ కారులో ఎక్కడికో వెళ్తున్నారనుకోండి. మీరు బస్ స్టాప్ వరకు వెళ్లేసరికి ముగ్గురు వ్యక్తులు బస్సు కోసం వేచి ఉన్నారు.
వారిలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 90 ఏళ్ల వృద్ధురాలు. ఆమె ఆసుపత్రిలో సకాలంలో చికిత్స పొందకపోతే మరణానికి దారితీసే పరిస్థితిలో ఉంది.
రెండవవారు, కొంత కాలం క్రితం మీకు చాలా సహాయం చేసిన, చాలా సన్నిహిత మిత్రుడు, ఆ సహాయం వల్లనే ఈ రోజు మీరు ఇలాఉన్నారు.
మూడవవారు, మీరు ఎంతో ప్రేమించే మీ ప్రియరాలు.
మీ కారులో ఒకరికి మాత్రమే స్థలం ఉందని అనుకుంటే, మీరు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు?”.
ఆ యువకుడు ఒక్కక్షణం ఆలోచించి "సర్, నా ప్రియురాలికి లిఫ్ట్ ఇస్తాను" అని బదులిచ్చాడు.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ‘దీనివలన మిగిలిన ఇద్దరికీ న్యాయం జరుగుతుందా?’ అని అడిగాడు.
యువకుడు, "లేదు సార్, కానీ ఈ రోజు కాకపోతే రేపు ఆ వృద్ధురాలు చనిపోవడం ఖాయం, నేను నా స్నేహితుడిని ఇంకోసారి ఎప్పుడైనా కలవవచ్చు, కానీ నా ప్రియురాలు ఒకసారి వెళ్ళిపోతే, ఆమెను మళ్లీ చూడలేనేమోనని అనుకుంటున్నాను." అని సమాధానం చెప్పాడు.
ఇంటర్వ్యూ అధికారి చిరునవ్వుతో, "మీ నిజాయితీగా చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. మీరు వెళ్ళవచ్చు" అని అన్నాడు.
కృతజ్ఞతలు చెబుతూ ఆ యువకుడు బయటకు వెళ్లిపోయాడు.
ఇంటర్వ్యూ అధికారి తదుపరి అభ్యర్థిని పిలవమని ప్యూన్ కు చెప్పాడు .
ఈ విధంగా, ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులందరినీ ఒకే ప్రశ్న అడిగారు. అభ్యర్థులందరూ విభిన్న సమాధానాలు చెప్పారు.
వృద్ధురాలికి లిఫ్ట్ ఇవ్వాలని కొందరు, స్నేహితుడికి లిఫ్ట్ ఇవ్వాలని కొందరు, ప్రియురాలికి లిఫ్ట్ ఇచ్చేందుకు మరికొందరు ఇష్టపడ్డారు. ఇలా చాలాసేపు ఇంటర్వ్యూ సాగింది.
ఒక అభ్యర్థి మాత్రం అదే ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు, "సార్, నేను నా స్నేహితుడికి నా కారు తాళాలు ఇచ్చి, వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్తాను, తర్వాత కారుని అతని ఇంటికి తీసుకెళ్ళిపోమంటాను. నేను అతని ఇంటికి వెళ్లి, నా కారుని తర్వాత తెచ్చుకుంటాను. నా ప్రియురాలితో కలిసి నేను బస్సులో వెళ్తాను."
ఇంటర్వూ తీసుకుంటున్న అధికారి ఒక్కసారిగా లేచి కరచాలనం చేసి నవ్వుతూ ఇలా అన్నాడు,” మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాం”.
" ధన్యవాదాలు సార్’’ అంటూ ఆ యువకుడు ఆనందంగా ఛాంబర్ నుంచి బయటకు వచ్చాడు. ఇలా చివరకు ఇంటర్వ్యూ ముగిసింది.
కొన్నిసార్లు, మన ముందు ఉన్న సమస్యను ఒక కోణంలోంచి మాత్రమే చూస్తూ పరిష్కరించాలని చూస్తాం, అయితే సమస్య యొక్క పరిష్కారం అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవడంలో ఉంటుంది.
జీవితంలో చాలాసార్లు, ఒకరినే ఎంచుకోవడం ప్రాధాన్యత కాదు, అందరినీ వెంట తీసుకెళ్లడమే ముఖ్యం.
మనం హృదయాన్ని విన్నప్పుడు, ఎంపికలు చేసుకునే విస్తృతమైన మానసిక ప్రక్రియ ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు; ఏది సరైనదో మనకు ఎల్లప్పుడూ తెలుస్తుంది.
- దాజీ -
♾️
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి
ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.
https://t.me/+EP0P5o4HCztjYmRl
#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory
#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids
#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories
#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories
#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories
#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu
No comments:
Post a Comment