మీ చేతులు అందంగా ఉన్నాయా?
అందమైన చేతులు
ఒకసారి కొంతమంది అందమైన, స్థితిమంతులైన మహిళలు నది ఒడ్డున ఒక పిక్నిక్ కు వచ్చి, ఆనందిస్తున్నారు. కాసేపటి తర్వాత, నదిలోని చల్లటి, స్వచ్ఛమైన నీటిలో తమ చేతులను, కాళ్ళను కడుకుంటూండగా, నీటిలో వారి ప్రతిబింబం కనిపించింది.
నీటిలోని ప్రతిబింబాన్ని చూసుకుని తమ అందాలని వారే పొగుడుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళలో ఒకావిడ, "చూడు, నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో" అంది.
మరో మహిళ తన చేతులు మరింత అందంగా ఉన్నాయని అంది.
మూడో స్త్రీ కూడా అలాగే అంది.
ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అప్పుడే వారు అటుగా వెళుతున్న ఒక వృద్ధ మహిళను చూశారు. ఆమె ఒక కర్ర సహాయంతో నడుస్తోంది, బట్టలు మురికిగా ఉన్నాయి. ఆమె బాగా అలసిపోయి, ఆకలిగా ఉన్నట్లుగా కనిపించింది.
ఆ ధనవంతులలో ఒకామె, "ఈ వృద్ధురాలిని పిలిచి, ఎవరి చేతులు చాలా అందంగా ఉన్నాయో అడగండి" అని సలహా ఇచ్చింది. వారందరూ దీనికి అంగీకరించి, ఒకరు ఆ వృద్ధురాలిని పిలిచారు.
ఆ ముసలావిడ దగ్గరికి రాగానే అందరూ ఆమెకు తమ చేతులు చూపించి, “ఎవరి చేతులు అందమైనవో చెప్పు ?” అని అడిగారు.
ఆ వృద్ధురాలు, "నాకు చాలా ఆకలిగా, దాహంగా ఉంది, మొదట నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి, అప్పుడు నేను మీకు సమాధానం చెప్పగలను", అని అంది.
కానీ ఆ మహిళలు ఆమెకు ఆహారం ఇవ్వడానికి నిరాకరించి, అక్కడనుండి వెళ్ళిపోమన్నారు.
కొంతదూరంలో ఒక నిరుపేద స్త్రీ కూర్చుని పని చేసుకుంటూ ఉంది. ఆమె ఇదంతా చూసింది. ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్లి, చేయి పట్టుకుని ఎంతో ప్రేమగా తను పనిచేస్తున్న చోటికి తీసుకొచ్చి, కూర్చోబెట్టింది.
ఆ వృద్ధురాలి తలపై చేయి వేసి నిరుపేద మహిళ ఓదార్చింది. ఆ తర్వాత ఆమె చేతులు, కాళ్ళు కడిగి, తన స్వంత బట్టలతో వాటిని తుడిచింది.
అప్పుడు ఆమె తాను తెచ్చుకున్న ఆహారం నుండి వృద్ధురాలికి తినడానికి కొంత ఇచ్చి, త్రాగడానికి నీరు ఇచ్చింది.
వృద్ధురాలికి కొంచెం మెరుగ్గా అనిపించిన తర్వాత, ఆమె ధనవంతులైన ఆ స్త్రీల వద్దకు తిరిగి వెళ్లి, పేద స్త్రీ వైపు చూపిస్తూ, "ఆమెకు చాలా అందమైన చేతులు ఉన్నాయి..."
ఆడవాళ్ళంతా నవ్వుతూ "అందం గురించి నీకేం తెలుసు. అందం అంటే ఏమిటో కూడా నీకు తెలియదు!" అన్నారు హేళనగా.
దానికి ఆ వృద్ధురాలు ఇలా బదులిచ్చింది, " మంచి పనులు చేసేవారికి, పేదలకు సేవ చేసేవారికి మాత్రమే అందమైన చేతులు ఉంటాయి. మంచి పనులతో చేతుల అందం పెరుగుతుంది కానీ, నగలతో కాదు.."
♾️
మన చుట్టూ చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి సహాయం చేయడం, సేవ చేయడం సర్వ మానవాళికి సేవ చేయడానికి లభించిన ఒక అవకాశంగా భావించాలి. ప్రార్థన సహాయపడుతుంది, కానీ అది చివరి ప్రయత్నం అయ్యి ఉండాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా సాధ్యమైనంతగా, మన సహాయాలను, సేవలను విస్తరింపజేద్దాం. 🌼
దాజీ
టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి
ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.
#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory
#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids
#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories
#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories
#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories
#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu