కథ-215 ♥
విలీనం అంటే ఏమిటి?
దీపం మీద చిమ్మటపురుగు ప్రేమ
సూఫీ సాహిత్యంలో చిమ్మటల గుంపు గురించిన ఒక అందమైన కథ ఉంది.
చిమ్మటలన్నీ దీపపు జ్వాల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి. ఒకరోజు ఒక చిమ్మట ఇలా అంది, "దీపపు జ్వాల యొక్క ప్రత్యేకత ఏమిటి? దాని దగ్గరగా ఎందుకు వెళ్లాలనిపిస్తుంది? ఈ దీపపు జ్వాల యొక్క ఆకర్షణ మనల్ని ఏ హద్దులు లేనంతగా బంధించింది. ప్రతి క్షణం, ఆ వైపు వెళ్ళాలని మనం తహతహలాడతాం. ఆ రహస్యం ఏమిటి?"
తోటి చిమ్మట ఇలా చెప్పింది, "మంట దగ్గరగా వెళితే తెలుస్తుంది కదా!"
ఉత్సుకతతో, అన్ని చిమ్మటలు ఒక్కొక్కటిగా దాని దగ్గరికి వెళ్లాయి; అవన్నీ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాయి. అయస్కాంతం సూదిని ఆకర్షిస్తున్నట్లుగా దీపపు జ్వాల వాటిని ఆకర్షిస్తోంది.
ఆ రహస్యం తెలుసుకోవడానికి, చిమ్మటలన్నీ దీపం దగ్గరకు వెళ్లి దాని తీవ్రమైన వేడిని అనుభవించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చాయి.
చిమ్మట పెద్ద ఇలా అంది, " దీపపు జ్వాలతో మనం ఒక్కటి అయ్యేంత వరకు ఈ రహస్యాన్ని తెలుసుకోలేం. మీరందరూ ఆ జ్వాల దగ్గరగా వెళ్తారు, కానీ ఆ జ్వాలతో ఒకటయ్యే లోపే వెనక్కి వచ్చేస్తారు. కాబట్టి, దాని రహస్యం మీకు ఎప్పటికీ తెలియదు."
ఈసారి చిమ్మట పెద్ద వంతు వచ్చింది. ఆ దీప జ్వాలకి అతి దగ్గరగా వెళ్లి, ఆ చిమ్మట పెద్ద ఆ క్షణంలో ఏ చీకు చింతా లేకుండా, మండుతున్న జ్వాలలోకి ప్రవేశించి... ఆ జ్వాలతో శాశ్వతంగా ఏకమయ్యింది.
♾️
ఎవరి మనస్సులో భగవంతుని సాక్షాత్కార స్థితికి చేరుకోవాలనే బలమైన కోరిక ఉంటుందో, వారు ఖచ్చితంగా ఈ స్థితికి చేరుకోగల సాధనాన్ని పొందుతారు. లోతుగా మునిగిపోయేవాడే ముత్యాన్ని కనుగొంటాడు. 🌼
బాబూజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory
#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories
#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories
#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories
#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu
No comments:
Post a Comment