♥️ కథ-214 ♥
మన అస్తిత్వాన్ని మనం గుర్తిస్తున్నామా?
బంగారు పక్షి
ఉపనిషత్తులలో చాలా అందమైన ఈ కథ ప్రస్తావించబడి ఉంది.
ఒక అడవిలో ఒకే చెట్టులో బంగారు రెక్కలున్న రెండు పక్షులు నివసిస్తూ ఉండేవి.
చెట్టు పై కొమ్మపై కూర్చున్న పక్షి స్థిరంగా ఉంటూ, ప్రశాంతచిత్తంతో తన స్వంత ప్రపంచంలో ఆనందంగా ఉండేది. అది ఈ చెట్టు పండ్లను తినేది కాదు. తన ఆనందం కోసం, సంతోషం కోసం ఏ బాహ్య వస్తువుపై ఆధారపడేది కాదు. ఎలాంటి కోరికలు, అవసరాలు లేకుండా తన ఆత్మ గౌరవంతో పరిపూర్ణంగా ఉండేది.
చెట్టు మధ్య భాగాన కూర్చున్న పక్షి ఎప్పుడూ సరదాగా, ఆడుతూ ఉంటుంది. ఈ పక్షి కొన్నిసార్లు ఈ చెట్టు యొక్క తీపి పండ్లను, కొన్నిసార్లు చేదు పండ్లను తింటుంది. రుచికరమైన వాటిని పొందడానికి, ఆ పక్షి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ పైకి దూకుతూ ఉంటుంది. ఆకలితో ఎన్నడూ తృప్తి చెందని ఆ పక్షి, ఎప్పుడూ తీపి పండ్ల కోసం అసహనంగా వెతుకుతూఉంటుంది.
రుచికరమైన తీపి పండ్లను తిన్నప్పుడు, ఆ పక్షి క్షణికమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని అనుభవిస్తుంది, కానీ ఈ ఆనందం శాశ్వతంగా ఉండదు; పక్షికి వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది.
ఒకసారి, అది చాలా చేదు పండ్లను తిని, నిర్లిప్త భావంతో, స్థిరమైన మనస్సుతో, పైన కూర్చున్న పక్షిని చూస్తుంది. అటువైపుగా కదలడం మొదలుపెడుతుంది, కాస్త పైకి ఎక్కిన తర్వాత మళ్లీ అన్నీ మర్చిపోయి తీపి పండ్లను రుచిచూడడంలో మునిగిపోతుంది.
ఇలా చాలా సార్లు జరుగుతుంది. చేదు పండ్లను తిన్నప్పుడల్లా, తీవ్రంగా కలత చెంది, తీవ్రంగా గాయపడినట్లుగా, తన పండ్ల నుండి తాను వేరు చేయబడినట్లుగా భావిస్తుంది. ఇక పండ్లు తినకూడదనుకుంటుంది. పండ్ల రుచితో సంతృప్తి చెందినట్లు భావించి, నేరుగా పైనున్న పక్షి వైపుకు ఎగురుతూ, పైనున్న పక్షికి చాలా దగ్గరగా చేరుకుంటుంది.
అప్పుడు స్వయంగా ప్రకాశిస్తున్న ఆ పక్షి తేజస్సు, తనపై ప్రతిబింబించడం ప్రారంభమవుతుంది; అది తనలో తాను పూర్తిగా లయమైపోతుంది. తనదైన ప్రత్యేకమైన అస్తిత్వం అదృశ్యమైపోయి, క్రింద ఉన్న పక్షి పూర్తిగా పైన ఉన్న పక్షితో కలిసిపోతుంది.
అసలు రెండవ పక్షి అనేది ఎప్పుడూ లేదని, చాలా ప్రశాంతంగా, పైన ఉన్నట్లుగా కనబడుతున్న పక్షి కూడా తానేనని ఇప్పుడు తెలుసుకుంది.
♾️
శాశ్వతమైన సత్యం యొక్క మూలం వైపు మన దృష్టిని మళ్లించనంత వరకు, మనం మోక్షానికి, విలీనానికి అవకాశం, ఆశ లేకుండా మాయ యొక్క వలలో చిక్కుకుని ఉండిపోతాం. 🌼
బాబూజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి
ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.
https://t.me/+EP0P5o4HCztjYmRl
#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory
#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids
#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories
#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories
#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories
#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu
No comments:
Post a Comment