Tuesday, May 31, 2022

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో - కథ-213

 

మిత్రులారా, లక్ష్యసాధనలో మనకు ఆటంకంగా ఉన్న అలవాట్లను, ధోరణులను మనం వదిలించుకోవాలనుకుంటున్నామా?

తోటమాలి

ఒక తోటమాలి తన చిన్న తోటలోని ప్రతి చెట్టును, మొక్కను చాలా ఇష్టపడేవాడు, వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా, చిన్న పిల్లల్లాగే చూసుకునేవాడు.


 తన తోటలోని చిన్న పొదలను కూడా అన్నిటితో సమానంగా రక్షించేవాడు. వాడిపోయి ఎండిన ఆకులను, కొమ్మలను కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకునేవాడు.

 తన తోటలోని పొదలను, ఎండిపడిపోయిన చిన్న కొమ్మలను కూడా ఎంతగానో ఇష్టపడేవాడు, అందువల్ల వాటిని బయటకు విసిరేయాలని అనుకోలేదు. క్రమంగా, అతని ఆకుపచ్చని, అందమైన చిన్నతోట ఎండిపోయిన ఆకులు, కొమ్మలతో నిండిపోయింది. ఎట్టకేలకు పచ్చని అద్భుతమైన తోట ఒక చెత్త కుప్పగా మారిపోయింది.

మిత్రులారా, ఇది తోటమాలికి సంబంధించిన చిన్న కథ, కానీ వాస్తవానికి, మనలో చాలా మంది ఈ తోటమాలిలా లేరా? మనం  మన ఆందోళనలను, భయాలను, నిరాశలన్నింటినీ పక్షపాతవైఖరులుగా మన వద్దే సురక్షితంగా ఉంచుకుంటున్నాం.

హార్ట్‌ఫుల్‌నెస్ నిర్మలీకరణ పద్ధతిని ఉపయోగించడం ద్వారా, మనం వాటన్నింటినీ పక్కన పెట్టి, వాటిని మరచిపోవచ్చు! 

అలాకాకుండా వాటన్నింటినీ కాపాడుకుంటూ ఉంటే, ఏదో ఒక రోజు మన జీవితపు తోట కూడా ఒక చెత్త కుప్పలా మారిపోతుంది.


 ♾️ 


ఒక వ్యక్తి విచక్షణా శక్తిని ఎంత బాగా కలిగి ఉంటే అతని ఆత్మ కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటే, అంత ఎక్కువ జ్ఞానం అతను కలిగి ఉంటాడు. 🌼

లాలాజీ


టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.

https://t.me/+EP0P5o4HCztjYmRl

#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory 

#365daysShortStories #everydayone short story #daily1shortstory

#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids

#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple short stories #goodstories #goodshortstories

#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories 

#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories 

#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu

No comments:

Post a Comment