♥️ కథ-18 ♥️
అనుభూతి : నా ప్రవర్తనను తీర్చిదిద్దడంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను
ప్రవర్తన
ఒకానొకప్పుడు వైవిధ్యమైన శాస్త్రాలలో ఉన్న అపారమైన జ్ఞానం వల్ల దేశంలోని వారందరి చేత గౌరవించబడే ఒక రాజ పురోహితుడు ఉండేవాడు. అంతటి జ్ఞానవంతుడైనా, ఆయనకి కొంచెం కూడా అహం లేదు.
ప్రాపంచిక, ఆధ్యాత్మిక పురోగతికి జ్ఞానం, ప్రవర్తనల కలయిక మాత్రమే నిజమైన మార్గం అని ఆయన విశ్వసించాడు.
ప్రజలకే కాదు, మహారాజుకు కూడా ఆయనంటే ఎంతో గౌరవం.
పురోహితుడు రాజాస్థానానికి వచ్చినప్పుడు రాజు ఎల్లప్పుడూ తన సింహాసనం నుండి లేచి, పురోహితుడు కూర్చున్న తర్వాత మాత్రమే కూర్చునేవాడు.
ఒకసారి పురోహితునికి తనకు ఈ గౌరవం ఎందుకు లభిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది - ఈ గౌరవం తన జ్ఞానం కోసమా లేక తన బలమైన నైతిక స్వభావానికి ఆదరణా ?
అది కనిపెట్టడానికీ, తన ఉత్సుకతను సంతృప్తిపరచడానికీ ఒక పథకం వేసుకున్నాడు.
తన ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావడానికి, పురోహితుడు రాజు యొక్క ఖజానాకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా నిధిలోంచి ఐదు అమూల్యమైన ముత్యాలు తీసి జేబులో పెట్టుకున్నాడు.
అది చూసిన కోశాధికారి ఆశ్చర్యపోయాడు. గౌరవనీయులైన రాజ పురోహితుడు దొంగతనం చేయగలడని లేదా ధనం అంటే దురాశ కలవాడని అతను నమ్మలేకపోయాడు. ఈ ఆలోచనతో రోజంతా కలవరపడ్డాడు.
మరుసటి రోజు, రాజదర్బార్ నుండి తిరిగి వస్తుండగా, పూజారి మళ్లీ ఖజానాను సందర్శించి, ఐదు ముత్యాలను తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.
ఇప్పుడు, కోశాధికారికి పూజారి పట్ల ఉన్న గౌరవం క్షీణించడం ప్రారంభమైంది.
మూడో రోజు కూడా అదే సంఘటన జరగడంతో కోశాధికారి ఓపిక నశించి ఇక ఆగలేకపోయాడు. రాజ పురోహితుడు దుష్ట ఆంతర్యాలు కలిగిఉన్నాడన్న అతని అనుమానం ధృవీకరించబడింది.
జరిగిన సంఘటన అంతా రాజుకు వివరంగా చెప్పాడు. ఈ సమాచారం విన్న రాజు చాలా ఆశ్చర్యపోయాడు. పురోహితుని పట్ల రాజుకు గల గౌరవం, విశ్వాసం పూర్తిగా ధ్వంసం అయిపొయింది.
పురోహితుడు నాల్గవ రోజు రాజాస్థానానికి వచ్చినప్పుడు, రాజు అతనిని పలకరించడానికి సింహాసనం నుండి లేవలేదు సరికదా అతని వైపు చూడలేదు.
పూజారి తన ప్రణాళిక పనిచేస్తున్నది అన్నదానికి దీనిని ఒక చిహ్నంగా తీసుకున్నాడు.
అతను ముత్యాలు తీసుకున్న ప్రయోజనం త్వరలో నెరవేరబోతోందన్న ఆలోచనతో, నిశ్శబ్దంగా తన స్థానంలో కూర్చున్నాడు.
రాజకీయ కార్యకలాపాలు పూర్తి అయిన తర్వాత, పురోహితుడు మిగతా సభ్యులలాగా బయలుదేరడానికి లేచినప్పుడు, రాజు ఆయన్ని కొంత సేపు వేచిఉండమని ఆదేశించాడు.
మిగిలిన సభాసదులందరూ వెళ్ళిపోయిన తర్వాత, రాజు ఆయనని అడిగాడు, "మీరు రాజ ఖజానా నుండి ఏదో తీసుకున్నారని నేను విన్నాను, అది నిజమేనా?".
ఈ ప్రశ్నకు పురోహితుడు మౌనంగా ఉండడంతో రాజుకు కోపం వచ్చింది.
ఈసారి స్వరం పెంచి, “రాజ ఖజానా నుండి ముత్యాలు తీశారా ?” అని అడిగాడు.
పురోహితుడు మౌనంగా అవునన్నట్లుగా తల వూపాడు.
రాజు తర్వాతి ప్రశ్న: "ఎన్ని ముత్యాలు తీసుకున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు?" అని కాసేపు ఆగి, తర్వాత ఇలా అడిగాడు, “ఆ ముత్యాలు ఎక్కడ ఉన్నాయి?”
పురోహితుడు తన జేబులోంచి చిన్నగా మడతపెట్టిన సంచి తీసి రాజు ముందు పెట్టాడు. అందులో మొత్తం పదిహేను ముత్యాలున్నాయి.
దుశ్చర్యకు సంబంధించిన రుజువు చూసిన రాజుకు ఒక్కసారిగా కోపం, విచారం, ఆశ్చర్యం కలిగాయి.
రాజు ఇలా అన్నాడు, “ స్వామి ఇలా ఎందుకు చేసారు? కనీసం మీ పదవితో ముడిపడిన గౌరవం గురించి అయినా మీరు పట్టించుకోలేదా? ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించలేదా ? అలా చేయడం వల్ల మీరు మీ జీవితకాలపు పరువును పోగొట్టుకున్నారు.”
“ ఏదో ఒకటి చెప్పండి, ఎందుకు ఇలా చేశారు?”
బాధలో ఉన్న రాజుని చూసి, పురోహితుడు ప్రతిదీ వివరంగా చెప్పి , తృప్తిగా అన్నాడు, "మహారాజా, జ్ఞానం, ప్రవర్తన - ఈ రెంటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికే ఖజానా నుండి ముత్యాలను తీసుకున్నాను.
నైతికమైన, ఋజుప్రవర్తన యొక్క ప్రాముఖ్యతపై నా దృక్పథం ఇప్పుడు చాలా స్పష్టమైంది”.
మీ నుండి, మీ ప్రజల నుండి ఇప్పటివరకు నాకు లభించిన ప్రేమ, గౌరవం నా జ్ఞానం వల్ల కాదు, నా ప్రవర్తన వల్ల.
మీ ఖజానాలో అత్యంత విలువైనది 'ప్రవర్తన'.
కాబట్టి, మీ రాజ్యంలోని ఉన్నత నైతికత కలిగిన వ్యక్తులను మీరు ప్రోత్సహించాలని, అభినందించాలని నేను కోరుకుంటున్నాను.
ఈ విధంగా, ప్రజల దృష్టిలో ఉన్నత ప్రవర్తన యొక్క విలువ క్రమంగా పెరిగి , బలమైన దేశానికి పునాది వేయబడుతుంది.
శతాబ్దాలుగా ఒక బలమైన నైతిక ప్రవర్తన, జ్ఞానం యొక్క అహంకారంపై విజయం సాధించిందనడానికి చరిత్రయే రుజువు .
♾️
" మంచి హృదయం, దయగల భావాలు, సమతుల్య మనస్సు - ప్రవర్తనకు పునాదిగా ఉంటాయి." 🌼
లాలాజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
టేలిగ్రం గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఈ క్రింది లింక్ ను షేర్ చేయగలరు.
https://t.me/+EP0P5o4HCztjYmRl
#heartfulness #hertfulnessstories #heartstories #dailyonestory #shortstories #daily1shortstory
#bedtimestories #bedstoriesforkids #storiesforbedtime #kidsstoriesatbedtime #bedtimekids
#dailyshortstories #storiesforkids #kidsstories #stories for children #childrenstories #good stories #shortstory #simplestory #simplestories #simple shortstories #goodstories #goodshortstories
#dailystories #telugushortstories #telugustories #telugustoriesforkids #supersimplestories
#supershortstories #newshort stories #newstoriesforkids #vintagestoriesforkids #oldshortstories
#oldstoreisforkids #oldkidsstories #vintagetelugustories #vintagetelugustoriesforkids #daaji #daajimaharaj #heartfulnesstelugustories #heartfulnessshortstories #hearfulnesstelugu
No comments:
Post a Comment